TG-408
Telugu

యేసూ, యాత్మ ప్రియుఁడా నిన్ను

yeesuu, yaathma priyumdaa ninnu

201
views
పల్లవి

యేసూ, యాత్మ ప్రియుఁడా నిన్ను నాశ్రయించితి లేవఁగా దరంగముల్ గాలివాన కొట్టఁగా లోకబాధ లన్నిఁటన్ నన్ను దాఁచు రక్షకా రేపునకు నడ్పుము నాదు యాత్మన్ బ్రోవుము

1వ చరణం

దిక్కు లేని యాత్మకు వేఱె ప్రాపు లేదిఁక ఒంటిగాను విడ్వక నన్ను నాదరించుమీ నిన్నె నమ్మి యుంటిని నీవె నా సహాయము కాపులేని నా తలన్ కాయుమా నీ నీడను ||యేసూ, యాత్మ||

2వ చరణం

క్రీస్తు నిన్నెఁ గోరుదున్ దొర్కు నన్ని నీ కడన్ పడ్డ హీను నెత్తుమీ స్వస్థపర్చు రోగులన్ న్యాయశుద్ధ నామము నీదె, నేను పాపిని నేను పాపపూర్ణుఁడన్ నీవు ప్రేమారూపివి ||యేసూ, యాత్మ||

3వ చరణం

పాపమెల్ల మాన్పఁగా నీదు ప్రేమ చాలును మాన్పు నీళ్లు నాయెదన్ శుద్ధి చేయఁగా నిమ్ము నీవు బ్రత్కు టూటవు త్రాగనిమ్ము నీదరిన్ పుట్టి నాదు నాత్మలో నెల్ల ప్రొద్దు పారుమీ ||యేసూ, యాత్మ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.