పరలోకము నా దేశము
Paralokamu Naa Deshamu
పరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగ నేను యాత్రికుడను (2) ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము (2) ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2) ||పరలోకము||
దూతలు పాడుచుందురు పరమందున దీవా రాత్రమునందు పాడుచుందురు (2) పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2) ||పరలోకము||
రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్ వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2) కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2) ||పరలోకము||
అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్ అగుపడుచున్నది గమ్యస్థానము (2) అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2) ||పరలోకము||
నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండునచ్చట (2) పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2) ||పరలోకము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.