TG-4077
Telugu

పరమ దైవమే

Parama Daivame

25
views
పల్లవి

యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి తిరిగి జన్మిస్తే ఆయన కొరకు జీవించగలం ఆయనను మనలో చూపించగలం పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను – హల్లెలూయ క్రీస్తు పుట్టెను – హల్లెలూయ క్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2) ||పరమ దైవమే||

1వ చరణం

ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు శరీరమును ధరించెను సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు దీనత్వమును వరించెను వైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2) దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా… ||పరమ దైవమే||

2వ చరణం

అనాది వాక్యమే కృపా సమేతమై ధరపై కాలు మోపెను ఆ నీతి తేజమే నరావతారమై శిశువై జననమాయెను పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను (2) భూలోకమును చేరెను – యేసు రాజుగా… ||పరమ దైవమే||

3వ చరణం

నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై కుమారుడై జనించెను సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై రాజ్యమునే భరించెను మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – (2) సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా… ||పరమ దైవమే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.