♪♫
TG-5372
Telugu
నేను నీ వాఁడను దేవా నిక్కంబుగ నేను
Neenu Nee Vaandanu Deevaa Nikkanbuga Neenu
0
views
పల్లవి
నేను నీ వాఁడను దేవా నిక్కంబుగ నేను నీ వాఁడను దేవా వీనుల నీ ప్రేమ వివర మాలించుచు మేను నాత్మయు నిత్తు మేలొసఁగు నీకిపుడు ||నేను||
1వ చరణం
1. ఘనుఁడ వైన నీవు గలిగించితివి నన్ను మనుజ లోకమునందు నిను నేను సేవింప ||నేను||
2వ చరణం
2. నాకు నవసర మౌన నానా వస్తువు లిచ్చి నీ కటాక్షము నన్ను నిల్పుచున్నది గాన ||నేను||
3వ చరణం
3. నా దోషముల నుండి నన్ను రక్షింపను నీదు పుత్రుని ప్రేమ నిండార నొసగితివి ||నేను||
4వ చరణం
4. నే నఘముల చేత నిజముగఁ జావఁగ నీ నెనరుచే నన్ను నీవు బ్రతికించితివి ||నేను||
5వ చరణం
5. నా తనువు నాత్మయు నాకుఁ గల్గిన వన్ని నా తండ్రి యిచ్చితివి నాకు నీ కృప చేత ||నేను||