TG-3477
Telugu

ఇంతవరకు నీవ

Inthavaraku Neevu

0
views
పల్లవి

ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు నేనేమాత్రము మేము ఏ మాత్రము నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు||

1వ చరణం

ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని (2) మందను వెంటాడి తిరుగుచుంటినే (2) సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే చూచిన||

2వ చరణం

నా ఆలోచనలన్ని చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే (2) తాత్కాలిక సహాయము నే అడిగితినే (2) యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2) ||నే చూచిన||