TG-3969
Telugu

నీవు తప్ప నాకీ లోకంలో

Neevu Thappa Naakee Lokamlo

0
views
పల్లవి

నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2) దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు||

1వ చరణం

గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2) కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు||

2వ చరణం

లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన (2) ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు||

3వ చరణం

నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా (2) తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు||