TG-1272
Telugu

ఎండిపోయిన ఎముకల్లారా

endipooyina emukallaaraa

199
views
పల్లవి

ఎండిపోయిన ఎముకల్లారా నిద్రించుచున్న సోదరులారా యేసయ్య స్వరమును వినండి ప్రభు చెంత చేరండి జీవాన్ని పొందండి

1వ చరణం

మట్టితో నిన్ను చేసెను జీవాత్మ నీలో పోసెను తన రూపు నీకిచ్చెను మహిమతో నిన్ను నింపెను యేసయ్య నిన్ను పిలువగా సిగ్గుతో పరుగిడనేల ||ఎండి||

2వ చరణం

సొంత దొడ్డి మరిచావు మరణమార్గమును నీవు కోరావు జీవాహారము లేక నీవు జీవచ్ఛవమై యున్నావు యేసయ్య నిన్ను చూడగా ఎండిపోయి మిగిలావు ||ఎండి||

3వ చరణం

జీవాధిపతి నిన్ను ప్రేమతో పిలచుచుండెను నూతన సృష్టి చేయ తన కరములు చాపియుండె ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకుమా ||ఎండి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.