TG-1269
Telugu

సహోదరి ప్రాణేశ్వరి నా ప్రియురాలా నా పావురమా

sahoodari praanneeshvari naa priyuraalaa naa paavuramaa

203
views
పల్లవి

సహోదరి ప్రాణేశ్వరి నా ప్రియురాలా నా పావురమా

1వ చరణం

నీ ప్రేమ ఎంతో మధురం మధురం నీ జిహ్వ క్రింద మధు క్షీరముండే నీ చిగురులు దాడిమ వనము ఆ ... వింతైన శ్రేష్ట ఫల వృక్షములు ||సహోదరి||

2వ చరణం

మూయబడిన ఉద్యాన వనమా మూత వేసిన జలకూపమా ఉద్యాన వనమా జలాశయమా ఆ ... లెబానోను పర్వత ప్రవాహమా ||సహోదరి||

3వ చరణం

ఒక చూపుతో నను వశ పరచుకొంటివి ఒక హారముతో వశ పరచుకొంటివి లెబానోను విడచి నా తోడ రమ్ము పరలోక తోట లో పరిణయమాడ ||సహోదరి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.