♪♫
TG-5392
Telugu
నోరారగా చేతును దైవారాధనను
Nooraaragaa Cheethunu Daivaaraadhananu
0
views
పల్లవి
నోరారగా చేతును దైవారాధనను (2) ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా||
1వ చరణం
భరియించితివి నా పాపపు శిక్షన్ జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా||
2వ చరణం
విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా||
3వ చరణం
దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా||
4వ చరణం
వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2) ||హల్లెలూయా||