TG-3474
Telugu

ఇన్నేళ్లు ఇలలో

Innellu Ilalo

0
views
పల్లవి

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు||

1వ చరణం

లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం (2) పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుని నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు||

2వ చరణం

మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2) నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు||