TG-4912
Telugu

చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మ

Chakkani Baaludamma Choodachakkangaa Unnaadamma

0
views
పల్లవి

చక్కని బాలుడమ్మ - చూడచక్కంగా ఉన్నాడమ్మ (2) కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ (2) ||చక్కని||

1వ చరణం

గొల్లలంతా గొప్ప దేవుడంటు - కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ - చేరినారు బేత్లహేములో (2) బంగారు సాంబ్రాణి భోళములు - అర్పించి ఆరాధించిరి లోక రక్షకుడు మా రారజని - కీర్తించి కొనియాడిరి ||చక్కని||

2వ చరణం

నింగిలోన పరిశుద్దులంతా - ప్రభువుని స్తుతించిరి బెత్లహేము పురములోన - భక్తులంతా పూజించిరి (2) సర్వోన్నతమైన స్థలములలోన - దేవునికే మహిమ అని దూతలంతా దివిలోన - పరవశించి పాడిరి ||చక్కని||