TG-5416
Telugu

పరమ నందుండెడు మా పరమ జనక నీదు

Parama Nandundedu Maa Parama Janaka Needu

0
views
పల్లవి

పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు పరిశుద్ధం బగును గాక త్వరగను నీ రాజ్యంబు ధరకు నరుగు దెంచుఁగాక పరమునందు నెట్టులనో ధరణియందు నట్లు నీ చి త్తంబు నెరవేరుఁగాక ||పరమ||

1వ చరణం

1.  మా యనుదినాహారము మాకు నేఁడు దయచేయుము మా యెడలను దప్పిదములఁ జేయువారి నైఁచునట్లు మాయపరాధము క్షమించి మము శోధనలోకిఁ దేక మహిని గీడు నుండి నీ స హాయమున దప్పించుము రా జ్యమ్ము శక్తి మహిమము నె ల్లప్పుడును నీవె యామేన్ ||పరమ||