TG-5511
Telugu

ప్రేమామయా నా యేసయ్యా నీ కోసమే నేనయ్యా

Preemaamayaa Naa Yeesayyaa Nee Koosamee Neenayyaa

16
views
పల్లవి

ప్రేమామయా నా యేసయ్యా నీ కోసమే నేనయ్యా నా గమ్యమే నీవెనయ్యా నీ కొరకు వేచానయ్యా ఎంత మాధుర్యమో నా పైనా నీకున్న ఈ ప్రేమా నా యేసయ్యా వింత అనుభవమే వర్ణించలేనయ్యా నా పైన నీ ద్యానమే గత కాలమంతా కాచావు నను చేరదీసిన యేసయ్యా నా పాపమంత మోసావు ఆ సిలువలోన యేసయ్యా పరమందున ఇహమందున - ఎనలేని నీ ప్రేమకై చిగురించేనే నా హృదయము - విలువైన అనుబంధమా నా స్నేహమే కోరినావు - నీ చెలిమినే పంచినావు నా చెంతకే చేరినావు - నీ ప్రేమనే చూపినావు నీ వాక్యమే నా దీపమై - నా త్రోవకు వెలుగుగా బ్రతికించెను చిరకాలము - నెమ్మది నాకిచ్చెను నా మార్గమై నడచినావు - నాకు అండగా నిలచినావు నా జ్యోతిగా వెలిగినావు - నా గమ్యమే చూపినావు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.