♪♫
TG-5414
Telugu
పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము
Parama Thandri Ninnu Mee Mee Parasa Kaalamu
0
views
పల్లవి
పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము స్వరము లెత్తి యింపు గాను స్మరణఁ జేతుము ||పరమ||
1వ చరణం
1. నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరువుగా నుతింతు మేము హర్స రవముతోఁ ||పరమ||
2వ చరణం
2. అవని సంభ్రమములలోన నవఘళించము అవసరముగ నీదు పలుకు నవధరింతుము ||పరమ||
3వ చరణం
3. వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను శ్రేయ మొక్కనాఁడు నిన్ను సేవ జేయుట ||పరమ||
4వ చరణం
4. ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ రుచినిజూతుము ||పరమ||
5వ చరణం
5. మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనెడు తరిని విడము నీదు ఉనికిపట్టును ||పరమ||
6వ చరణం
6. గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితోఁ గొరత లేక చేతు మెపుడు గొనబు గానము ||పరమ||
7వ చరణం
7. శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము సంతతమును నీవు మమ్ము సంతరించుము ||పరమ||
8వ చరణం
8. దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున వినతి చేతుము ||పరమ||