TG-4242
Telugu

సర్వాంగ కవచము నీవే

Sarvaanga Kavachamu Neeve

0
views
పల్లవి

సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా (2) నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి నా పాపమును తీసీ నా భారమును మోసావయ్యా… యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ.. నా ప్రాణము నీవే నా యేసయ్యా (2) వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై సమాధాన సువార్త నీవై నా యేసయ్యా ||నా సర్వము||

1వ చరణం

దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై బూడిదెనకు ప్రతిగా పూదండవై దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై ||నా సర్వము||