సర్వశక్తుని స్తోత్రగానము
Sarva Shakthuni Sthothragaanamu
సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ||
ముదముతో నిర్మానకుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వoచి దేవుని వందనముతో వేడరే (2) ||సర్వ||
వేదపారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవు నిక మీ స్వాoతమున బూజింపరే (2) ||సర్వ||
ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుఁగా నుతి జేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే (2) ||సర్వ||
చావు పుట్టుక లేనివాడుగ సంతతము జీవించును ఈవులిచ్చుచు దన్ను వేడు మ- హేష్టులను రక్షించును (2) ||సర్వ||
దాసులై దేవునికి నెదలో దర్పమును బోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము నే మరక మైదాల్పరే (2) ||సర్వ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.