TG-4243
Telugu

సర్వాంగ సుందరా

Sarvaanga Sundaraa

0
views
పల్లవి

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2) నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా (2) నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ||

1వ చరణం

నా శాపములు బాపినావా నా ఆశ్రయ పురమైతివా (2) నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ||

2వ చరణం

నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా (2) నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై నాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ||