TG-4114
Telugu

ప్రభు యేసుని వదనములో

Prabhu Yesuni Vadanamulo

0
views
పల్లవి

ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2) పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2) పరలోకముకై – చిర జీవముకై (2) ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని||

1వ చరణం

దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2) దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2) ధన పీడనతో – మృగ వాంఛలతో (2) దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని||

2వ చరణం

యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2) ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2) ఇల వేడితిని – విలపించుచును (2) ఈడేరెను నా వినతి ||ప్రభు యేసుని||

3వ చరణం

పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2) పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2) పరలోకమే నా – తుది ఊపిరిగా (2) పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని||