♪♫
TG-3376
Telugu
ఎంతో వింత యెంతో
Entho Vintha Yentho
0
views
పల్లవి
ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత (2) పంతము తో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో||
1వ చరణం
పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా (2) అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు (2) ||ఎంతో||
2వ చరణం
మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని (2) మొయ్యలేక మ్రాని తోడ మూర్చబోయే నేసు తండ్రి (2) ||ఎంతో||
3వ చరణం
కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలు సేతులలో జీలల్ (2) కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2) ||ఎంతో||
4వ చరణం
దాహము గొన చేదు చిరక ద్రావ నిడిరి ద్రోహు లకటా (2) ధాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగె నహహా (2) ||ఎంతో||
5వ చరణం
బల్లెముతో బ్రక్కన్ బొడవన్ పారే నీరు రక్త మహహా (2) ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు (2) ||ఎంతో| Yesunaadhu Marana Mantha (2) Panthamu Tho Jesi Rantha Sontha Prajalu Swaami Nantha (2) ||Entho||