ఎంతటి వాడను నేన
Enthati Vaadanu Nenu
ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా (2) ఇంతగ నను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు (2) ||ఎంతటి||
ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే (2) అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు ||ఎంతటి||
నిను వెంబడించువారిని నిజముగ సేవించువారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని (2) ఎంతో ఘనపరచెదవు ఆశీర్వదించెదవు శత్రువుల కంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||
వినయముగల మనుష్యులను వర్దిల్లజేసెదవు గర్విష్టుల గర్వమునణచి గద్దె నుండి దించెదవు (2) మాదు ఆశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే మా శైలము మా కేడెమా మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.