TG-3374
Telugu

ఎంతో మధుర

Entho Madhuram

0
views
పల్లవి

ఎంతో మధురం నా యేసు ప్రేమ ఎంతో క్షేమం నా తండ్రి చెంత (2) ఎనలేని ప్రేమను నాపైన చూపి ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ (2) ||ఎంతో||

1వ చరణం

నా నీతికి ఆధారము నా త్రోవకు వెలుగువై (2) దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక (2) ||ఎంతో||

2వ చరణం

పరిశుద్ధులకు పరిశుద్ధుడవు ప్రభులకు ప్రభుడవు నా యేసయ్యా (2) ఈ పాప లోకంలో నీ ప్రాణమర్పించి పరలోకమునకు మార్గము చూపావు (2) ||ఎంతో||