TG-5683
Telugu

రాలి పోదువో నీవు కూలిపోదువో

Raali Pooduvoo Neevu Koolipooduvoo

0
views
పల్లవి

రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏగడియో పువ్వు రాలు విదముగారాలి పోదువో అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా ||రాలిపో||

1వ చరణం

1.  రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా ఒట్టిదిరా నీవు మట్టివిరా (2) అయ్యో మానవా మాయరా ఇది మాయరా ||రాలిపో||

2వ చరణం

2.  కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా కుండవురా నీవు పగిలెదవు (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా ||రాలిపో||

3వ చరణం

3.  నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట ఎందరు వున్న ఒక్కడివే (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా ||రాలిపో||

4వ చరణం

4.  భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా మర్చిపోదురు నిన్ను ఒక దినము (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా ||రాలిపో||