♪♫
TG-4530
Telugu
యేసుతో ఠీవిగాను పోదమా
Yesutho Teevigaanu Podamaa
0
views
పల్లవి
యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో||
1వ చరణం
రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను (2) యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
2వ చరణం
విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
3వ చరణం
శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా (2) భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
4వ చరణం
ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి (2) లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||