TG-4532
Telugu

యుద్ధము యెహోవాదే

Yudhdhamu Yehovaade

18
views
పల్లవి

యుద్ధము యెహోవాదే (4) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ ||యుద్ధము||

1వ చరణం

వ్యాధులు మనలను పడద్రోసినా బాధలు మనలను కృంగదీసినా (2) విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ ||యుద్ధము||

2వ చరణం

ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా ||యుద్ధము||

3వ చరణం

అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా (2) యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ ||యుద్ధము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.