TG-4191
Telugu

రండి రండి యేసుని యొద్దకు

Randi Randi Yesuni Yoddaku

0
views
పల్లవి

రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల అవనిలో అగచాట్ల పాలైన అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి||

1వ చరణం

కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు ||రండి||

2వ చరణం

ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా సిలువను రక్తము చిందించియును బలియాయెను యా ఘనుడు మనకై ||రండి||

3వ చరణం

యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే యిచ్చును ||రండి||

4వ చరణం

నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి||