♪♫
TG-3832
Telugu
నన్ను కావగ వచ్చిన
Nannu Kaavaga Vachchina
0
views
పల్లవి
నన్ను కావగ వచ్చిన నజరేయా యేసయ్యా నేను పాపము చేసినా చూపావు నీ దయా నన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యా సిలువ నీడలో నన్ను దాచుమయ్యా లోకమంతా నన్ను దోషిగ చూసినా ప్రేమతోనే నన్ను చేరదీసిన ||నన్ను||
1వ చరణం
నిన్ను విడచి దూరమైనా ధూళి నేనే యేసయ్యా లోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యా అందరు నన్ను అనాథ చేసి పోయినా అంధకారమే నాకు బంధువై మిగిలినా నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా ||నన్ను||
2వ చరణం
నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా నీ శరణము వేడగానే నీది నాదిగా మారెనే ఏ యోగ్యత నాకు లేకపోయినా నీ వారసునిగా నన్ను ఎంచిన ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా ||నన్ను||