♪♫
TG-3833
Telugu
నన్ను నీవలె నిర్మించినన
Nannu Neevale Nirminchinanu
0
views
పల్లవి
నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు నిను బాధించినా భరియించితివా నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె||
1వ చరణం
ఎరిగి ఎరిగి చెడిపోతిని తెలిసి తెలివిగా తప్పిపోతిని (2) బ్రతికున్న శవమునై నేనుంటిని అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె||
2వ చరణం
భయభక్తులు లేని వెర్రివాడనై కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2) ఒక పూటకూటికై ఆశపడితిని వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె||
3వ చరణం
సిల్వలో నీ శ్రమ చూడకుంటిని కల్వరి ప్రేమను కానకుంటిని (2) నిన్ను సిలువ వేయమని కేకలేసితి అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||