TG-4252
Telugu

శాశ్వతమా ఈ దేహం

Shaashwathamaa Ee Deham

0
views
పల్లవి

శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా… శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా (2) క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణము నీటిపైన చిరు బుడగ వోలె – (2) దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా||

1వ చరణం

ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనవి తీరేనా నీ తనువే రాలిపోయినా – (2) నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా||

2వ చరణం

దేహ వాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో – (2) చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||