TG-2215
Telugu

తుప్పు పట్టి పోవుటకంటే

thuppu patti poovutakantee

66
views
పల్లవి

తుప్పు పట్టి పోవుటకంటే (2) కరిగిపోత యేసయ్య నీ చేతిలో అరిగిపోత యేసయ్య నీ సేవలో (2) ||తుప్పు||

1వ చరణం

సుఖమనుభవించుటకంటే శ్రమలనుభవిస్తాను నీ సేవలో నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా వెన్న లాగ కరుగుకుంట కటిక చీకట్ల దీపమైతానయ్యా నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా మూర్ఖమైన వక్ర జనం మధ్యల ముత్యమోలె నేనుండాలి యేసయ్యా దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా వెండి బంగారాల కన్నా ధన ధాన్యముల కన్నా నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా నాలో ఊపిరున్నంత వరకు ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను కటిక చీకట్ల దీపమెలిగిస్తాను