TG-4358
Telugu

తుప్పు పట్టి పోవుటకంటే

Thuppu Patti Povutakante

0
views
పల్లవి

తుప్పు పట్టి పోవుటకంటే (2) కరిగిపోత యేసయ్య నీ చేతిలో అరిగిపోత యేసయ్య నీ సేవలో (2) ||తుప్పు పట్టి||

1వ చరణం

సుఖమనుభవించుటకంటే (2) శ్రమలనుభవిస్తాను నీ సేవలో నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

2వ చరణం

వెన్న లాగ కరుగుకుంట (2) కటిక చీకట్ల దీపమైతానయ్యా నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

3వ చరణం

మూర్ఖమైన వక్ర జనం మధ్యల (2) ముత్యమోలె నేనుండాలి యేసయ్యా దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

4వ చరణం

వెండి బంగారాల కన్నా ధన ధాన్యముల కన్నా నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

5వ చరణం

నాలో ఊపిరున్నంత వరకు (2) ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను కటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2) ||తుప్పు పట్టి||