♪♫
TG-242
Telugu
దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను
daivaathma parishuddhudaa dhaaraalla preemanu
190
views
పల్లవి
దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను దండిగ నిచ్చి మమ్మును దయన్ దీవించుము.
1వ చరణం
మా యజ్ఞానాంధకారము వ్రయము జేయుము నీ యెక్కువైన తేజము మా యందు పోయుము. ||దైవాత్మ పరిశుద్ధుడా||
2వ చరణం
మా దర్గుణంబు లెల్లను చెదరఁ గొట్టుము మా పాప మణుపుటకై నీ శక్తిఁ జూపుము. ||దైవాత్మ పరిశుద్ధుడా||
3వ చరణం
సన్మార్గమందు నిత్యము మమ్ము నడుపుము నీ మోక్షమందు పిమ్మట మమ్మాదరింపుము. ||దైవాత్మ పరిశుద్ధుడా||