కృపలను తలంచుచు
krupalanu talanchuchu
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను||
మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను (2) ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం – (నన్ను) (2) ||కృపలను||
కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2) నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం – (యేసు) (2) ||కృపలను||
రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2) నాకు విరోధమై వర్ధిల్లదు యని చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2) ||కృపలను||
సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2) సతతము తన కృప వెల్లడిచేయ శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2) ||కృపలను||
హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2) సీయోను నివాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే – (ఆమెన్) (2) ||కృపలను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
