TG-4662
Telugu

ఉతక మీద తలుపు తిరుగు రీతిగా

Uthaka Meeda Thalupu Thirugu Reethigaa

0
views
పల్లవి

ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరిగాడును గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును సోమరీ మేలుకో వేకువనే లేచి ప్రార్ధించుకో వేకువనే లేచి పనులు చూచుకో జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో (2) చిన్న జీవులు చీమలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా (2) అయినను అవి క్రమము గానే నడచును జ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ||

1వ చరణం

చిన్న కుందేళ్ళను చూడు ఏ మాత్రం బలము లేని జీవులు (2) పేరు సందులలో నివసించును జ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ||

2వ చరణం

చిన్న జీవులు మిడతలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా (2) పంక్తులుగా తీరి సాగి పోవును జ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ||