TG-3015
Telugu

ఆహా మహాత్మ హా

Aahaa Mahaathma Haa

0
views
పల్లవి

ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా||

1వ చరణం

వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా||

2వ చరణం

నీవు నాతో పరదైసున – నేడే యుందువు పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా||

3వ చరణం

అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా||

4వ చరణం

నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా||

5వ చరణం

దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా ||ఆహా||

6వ చరణం

శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా ||ఆహా||

7వ చరణం

అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా ||ఆహా||