TG-279
Telugu

దేవా దీవించు మిప్పుడు దీన

deevaa deevinchu mippudu deena

203
views
పల్లవి

దేవా దీవించు మిప్పుడు దీన జనాళిన్ గావ రా రమ్మెల్లప్పుడు నీ వరగద్దెచుట్టు నిజ దాసు లిటులఁ గూడి పావన సంస్కారమును బంచి పాలొందుచుండ ||దేవా దీవించు||

1వ చరణం

మముఁ గావ నైదు గాయముల్ బొందిన దేవ సముఁడా నీ రక్త కాయముల్ విమలింపు భక్తి ద్వారా వీక్షించి మనసులందు అమిత దుః ఖ మొందుటచే నలిగిన భక్త జనులన్ ||దేవా దీవించు||

2వ చరణం

నీ రాజ్యమునకు మముఁ జేర్ప నిజము మా పాప ఘోర శాపమ్ములన్ దీర్ప నోరిమిచే మా కొరకు దారుణముగ నొందిన క్రూర మరణమును దలఁచి కుములుచున్న హృదయులను ||దేవా దీవించు||

3వ చరణం

కోరి నినుఁ గొలుచు భక్తుల కోరిక లభివృద్ది గా రాజిలఁజేయు శక్తుల ధారాళముగ నొసంగు ధనాత్ముండ నీ దివ్యా కార మందుండి యీ సం స్కార సమయమున మమ్ము ||దేవా దీవించు||

4వ చరణం

మా దారిద్ర్యములు బాపనే పాపభారంపు మ్రాను నీ దివ్య మూపుననే గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో బాధ లొందితి వనుచు బహుగా దుఃఖించు మమ్ము ||దేవా దీవించు||

5వ చరణం

నీ వీ విధంపు మరణముచే నిజముగా మమ్ము జీవింపఁజేసి నిల్పుటచే పావనదేవ మే మీ ప్రభు సంస్కారమ్ము మా మా జీవాత్మ లాదరణకై జే మనముగఁ గైకొనను ||దేవా దీవించు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.