TG-3048
Telugu

ఆరాధన యేసు నీకే

Aaraadhana Yesu Neeke

0
views
పల్లవి

ఆరాధన యేసు నీకే (4) నీ చిత్తం నేను జరిపెద చూపించే మార్గంలో నడిచెద నీ సన్నిధిలో నే నిలిచెద నా ప్రియ యేసువే (2) ||ఆరాధన||

1వ చరణం

సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్ మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) ||ఆరాధన||

2వ చరణం

దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2) ||ఆరాధన||