వినరే యో నరులారా
Vinare Yo Narulaaraa
వినరే యో నరులారా – వీనుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే అనుదినమును దే-వుని తనయుని పద వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే||
నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు – కరుణను గనరే ||వినరే||
ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను దీన దయా పరు-డైన మహాత్ముడు జానుగ యాగము – సలిపిన తెరంగిది ||వినరే||
ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు-ములనలరెడు ధని కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే||
దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె బిరబిర మన మం-దర మా కరుణా శరనిధి చరణ మె – శరణని పోదము ||వినరే||