TG-4410
Telugu

విలువేలేని నా జీవితం

Viluveleni Naa Jeevitham

0
views
పల్లవి

విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొనియుండగా రోదనతో ఒంటరినైయుండగా నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది||

1వ చరణం

పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసినా బంధువులే భారమని తలచినా నా కొరకే బలి అయితివే (2) ||నీది||

2వ చరణం

సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||