♪♫
TG-4413
Telugu
వినవా మనవి యేసయ్యా
Vinavaa Manavi Yesayyaa
0
views
పల్లవి
వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం – పగిలెను జీవితం చేసుకో నీ వశం ||వినవా||
1వ చరణం
లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా ||వినవా||
2వ చరణం
ఆశ ఏది కానరాక బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా నా దైవము నీవయ్యా ||వినవా||