TG-3088
Telugu

అది తల మీద పోయబడి

Adi Thala Meeda Poyabadi

0
views
పల్లవి

అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు||

1వ చరణం

సంఘ సహవాసములో సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) వాక్యమును విడచి ఐక్యత లోపించి తొలగిపోయిరి… ప్రభు కృప నుండి సహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు||

2వ చరణం

సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2) క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి అపహసించిరి… సువార్త సేవను పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2) ||సహోదరులు||