TG-3148
Telugu

అత్యున్నత సింహాసనముపై

Athyunnatha Simhaasanamupai

0
views
పల్లవి

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే (2) ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3) ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా||

1వ చరణం

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా||

2వ చరణం

స్తుతులపై ఆసీనుడా స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా||

3వ చరణం

మృత్యుంజయుడా స్తోత్రం మహాఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా||

4వ చరణం

ఆమెన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||