TG-5169
Telugu

నా జీవిత వ్యధలందు యేసే జవాబు (108)

Naa Jeevitha Vyadhalandu Yeesee Javaabu (108)

0
views
పల్లవి

- జె. దేవరాజు - Scale : Bm నా జీవిత వ్యధలందు - యేసే జవాబు యేసే జవాబు - ప్రభు యేసే జవాబు (2) 1.  తీరని మమతలతో - ఆరని మంటలలో ఆశనిరాశలతో - తూలెను నా బ్రతుకే ననుగని వచ్చెను - తన కృప నిచ్చెను కరుణతో ప్రేమించి - కలుషము బాపెను ||నా జీవిత||

1వ చరణం

2.  చీకటి వీధులలో - నీటుగా నడిచితివి లోకపుటుచ్చులలో - శోకము జూచితిని (2) ||నను||

2వ చరణం

3.  ద్రోహుల నమ్ముకొని - స్నేహము చేసితిని ఇడుముల పాల్జెసి - ఎడబాసిరి నన్ను (2) ||నను||

3వ చరణం

4.  హంగుల వేషంతో - రంగుల వలయంలో నింగికి నేనెగిరి - నేలను రాలితినే (2) ||నను||