TG-4938
Telugu

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా

Chinna Gorrepillanu Neenu Yeesayyaa

0
views
పల్లవి

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా||

1వ చరణం

ఒక్కటే ఆశ కలదు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేద (2) ||యేసయ్యా||

2వ చరణం

శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినావు నాకు యేసయ్యా (2) ||యేసయ్యా||

3వ చరణం

అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2) ||యేసయ్యా||