విలువైన నీ కృప నాపై

viluvaina nee krupa naapai

🎵 TG-2751🌐 Telugu
పల్లవి

విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2)       ||విలువైన||

1వ చరణం

గడచినా కాలమంతా తోడైయున్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2) లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2)     ||నా జీవిత||

2వ చరణం

సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కార్యాలు ఎన్నో చేశావు సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||

Report Error