♪♫
TG-4941
Telugu
చిన్నబిడ్డల విన్నపముల నెన్నడైన త్రోయక
Chinnabiddala Vinnapamula Nennadaina Throoyaka
0
views
పల్లవి
చిన్నబిడ్డల విన్నపముల నెన్నడైన త్రోయక పన్నుగ విను కన్న తండ్రిని సన్నుతింప జేరరే ||చిన్న||
1వ చరణం
1. భూమి మీద మానవునిగా స్వామి ఉండినప్పుడు ప్రేమతో అనేక మంది పిల్లల దరి జేర్చెను ||చిన్న||
2వ చరణం
2. చెంత జేర్చి చిన్న పిల్లల చేతులుంచి వారిపై ఎంతో దయతో నాశీర్వ దించె యేసు వారిని ||చిన్న||
3వ చరణం
3. చిన్న పిల్లల పోలికలను ఎన్నోమార్లు బోధలో ఎన్నుకొనుటలో మనయం దున్న ప్రేమ దెలిపెను ||చిన్న||
4వ చరణం
4. పాట పాడి ప్రభుని పేర కోటి స్తుతుల నియ్యరే చాటుగను బాహాటముగను మేటి ప్రభుని వేడరే ||చిన్న||