TG-4935
Telugu

చితికిన నా జీవితము చినిగిన ఓ కాగితము

Chithikina Naa Jeevithamu Chinigina Oo Kaagithamu

16
views
పల్లవి

చితికిన నా జీవితము చినిగిన ఓ కాగితము నా గుండె పగిలేనయ్యా నా మనసు విరిగేనయ్య నా ఆశ నీవే కావా నా మార్గములు నీవేగా నీ చేతితోనే నన్ను నడిపించుమా నా యేసు అలనాడు దానియేలు బబులోను దేశములో నీ పక్షముగా నిలబడినాడు నా ఆశ అదియే దేవా నా మార్గము అదియే నీ మాటతోనే నన్ను బ్రతికించుమా నా యేసు అలనాడు యోబును శ్రమలన్నిటి మధ్యన నడిపించినావా దేవా నా ఆశ అదియే దేవా నా మార్గము అదియే విశ్వాసముతో నన్ను చిగురింపచేయుము దేవా అలనాడు పౌలును నీ రెక్కల నీడలో కాపాడినావా దేవా నా ఆశ అదియే దేవా పరిశుద్దతతో నన్ను కడవరకు నడిపించు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.