♪♫
TG-4964
Telugu
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు
Choochuchunna Deevudavayyaa Nannu Choochinaavu
0
views
పల్లవి
చూచుచున్న దేవుడవయ్యా – నన్ను చూచినావు (2) నీ పేరు మిటో ఎరుగనయ్యా (2) నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) ||చూచుచున్న||
1వ చరణం
శారాయి మాటలే విన్నాను అబ్రహాము భార్యనై య్యాను (2) ఈ అరణ్య దారిలో ఒంటరినై (2) దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును ||చూచుచున్న||
2వ చరణం
ఇష్మాయేలుకు తల్లినైతిని అయినవారితో త్రోసివేయబడితిని (2) కన్నకొడుకు మరణము చూడలేక (2) తల్లడిల్లిపోతున్న తల్లిని నేను అనాథ తల్లిని నేను ||చూచుచున్న||
3వ చరణం
పసివాడి మొరను ఆలకించావు జీవజలములనిచ్చి బ్రతికించావు (2) నీ సంతతిని దీవింతునని (2) వాగ్దానమిచ్చిన దేవుడవు గొప్ప దేవుడవు ||చూచుచున్న||