♪♫
TG-4977
Telugu
చూడుము గెత్సెమనె తోటలో నా ప్రియుడు
Choodumu Gethsemane Thootaloo Naa Priyudu
0
views
పల్లవి
చూడుము గెత్సెమనె - తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది 1. దేహమంతయు నలిగి - శోకము నొందినవాడై దేవాది దేవుని ఏకసుతుడు పడు - వేదనలు నా కొరకే ||చూడుము||
1వ చరణం
2. తండ్రి యీ పాత్ర తొలగన్ - నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు - నన్నప్పగించితివనెను ||చూడుము||
2వ చరణం
3. రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది రక్షకుడేసు హృదయము పగులగ - విజ్ఞాపనము జేసెనే ||చూడుము||
3వ చరణం
4. ముమ్మారు భూమి మీద - పడి మిక్కిలి వేదనచే - మన యేసు ప్రభువు తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే ||చూడుము||
4వ చరణం
5. ప్రేమతో కూడిన వాక్కులచే - ఆదరించెడి ప్రభువు వేదన సమయమున ఆదరించువారు - లేక బాధనొందెను ||చూడుము||
5వ చరణం
6. నన్ను తన వలె మార్చెడి - ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుగగా - నే సదా కీర్తించెదను