TG-5685
Telugu

రావయ్యా యేసయ్యా నా ఇంటికి

Raavayyaa Yeesayyaa Naa Intiki

0
views
పల్లవి

రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని (2) కన్నులార నిన్ను చూడాలని (2) కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా||

1వ చరణం

యదార్థ హృదయముతో నడచుకొందును ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2) భక్తిహీనుల క్రియలు నాకంటనీయను మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా||

2వ చరణం

దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను నా పొరుగు వారిని దూషింపను (2) అహంకారము గర్వము నంటనీయను నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా||

3వ చరణం

నిర్దోష మార్గముల నడచుకొందును మోసము నా ఇంట నిలువనీయను (2) అబద్ధికులెవ్వరిని ఆదరింపను భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా||