TG-5686
Telugu

రావా దేవా నా ప్రేమామయుడా

Raavaa Deevaa Naa Preemaamayudaa

24
views
పల్లవి

రావా దేవా నా ప్రేమామయుడా నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా వినుమా దేవా నా దీన ప్రార్ధన కనుమా ప్రభువా నా ఆవేదన ఎలుగెత్తి నిను నేను పిలచుచున్నాను దరిచేరి నీవు నాకు దారిచూపుమా రావా దేవా నా ప్రేమామయుడా నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా నేను సేదతీరెద నీ తోడులేక నీ నీడలేక అల్లాడిపోయేనే నా మనసు నీ వాక్య ధ్యానమును మరచిపోతిని దినమంత నిరాశతో కృంగిపోతిని నీ ఊసులేక నీ ధ్యాసలేక వేసారిపోయేనే నా బ్రతుకు నీ ప్రేమ బాటను విడనాడితిని రేయంత రోధనతో నిట్టూర్చితిని

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.